‘సింగం’ ఫ్రాంచైజీతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి
బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో ఒకరు. రోహిత్ ఓ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం
వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ టైటిల్‌తో
తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ షో షూటింగ్లో అతడు గాయపడ్డాడు. కార్ ఛేజింగ్
సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా చేతికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నగర
శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ షూటింగ్ సందర్భంగా
గోల్మాల్ డైరెక్టర్ చేతికి గాయమైంది. దీంతో ప్రొడక్షన్ టీమ్ సత్వరమే
స్పందించి కామినేని హాస్పిటల్స్‌కు తరలించిచికిత్స అందించింది. వైద్యుల బృందం
చిన్నపాటి సర్జరీ చేశారని తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి
చేశారు. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని రోహిత్ శెట్టికి
పేరుంది. అదే బాటలో నడుస్తూ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ను
తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు. సిద్దార్థ్
మల్హోత్రా, శిల్పాశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.