ముప్పు తక్కువేనంటున్న శాస్త్రవేత్తలు
కేప్ కెనావెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి
పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే
ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ
ఉపగ్రహం సేవా కాలం ముగిసిపోయింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ
ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల
ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు
తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ది ఎర్త్ రేడియేషన్
బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడిపోనుంది. 1984లో ప్రయోగించిన ఈ
ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని
భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని
సేవలు నిలిచిపోయాయి.
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన కాలం చెల్లిన ఉపగ్రహం ఒకటి కక్ష్య
నుంచి జారిపోనుంది. అయితే దీనివల్ల భూమిపై ప్రమాదం తక్కువేనని శాస్త్రవేత్తలు
తెలిపారు. 2,450 కిలోల బరువున్న ఈ శాటిలైట్.. భూవాతావరణంలోకి ప్రవేశించి
మండిపోతుందని చెప్పారు. కొన్ని భాగాలు మాత్రం ఈ ప్రక్రియను తట్టుకొని నేలపై
పడొచ్చని పేర్కొన్నారు. వాటివల్ల ఎవరైనా గాయపడే అవకాశం చాలా స్వల్పమన్నారు.
ఆది, సోమవారాల్లో ఈ పరిణామం జరగొచ్చని భావిస్తున్నారు. ఎర్త్ రేడియేషన్
బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) అనే ఉపగ్రహాన్ని 1984లో ప్రయోగించారు.
ఛాలెంజర్ స్పేస్ షటిల్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. రెండేళ్ల పాటు
పనిచేస్తుందని భావించినప్పటికీ ఈ శాటిలైట్ 2005 వరకూ సేవలు అందించింది.
ఓజోన్తోపాటు, భూ వాతావరణానికి సంబంధించిన అనేక వివరాలను సేకరించింది.
సూర్యుడి నుంచి వచ్చే రేడియోధార్మికతను పుడమి ఎలా శోషించుకుంటోందన్నది
పరిశీలించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అమెరికన్ మహిళ అయిన శాలీ రైడ్ఈ
ఉపగ్రహాన్ని నాడు కక్ష్యలోకి విడిచిపెట్టారు. ఆ యాత్రలో ఛాలెంజర్‌లో ఆమెతోపాటు
కేథరీన్ సలువాన్ కూడా నింగిలోకి పయనించారు. ఇద్దరు మహిళా వ్యోమగాములు
అంతరిక్షంలోకి వెళ్లడం అదే మొదటిసారి. అప్పట్లో కేథరీన్ స్పేస్‌వాక్ కూడా
నిర్వహించారు.