ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి పేరుప్రఖ్యాతులు
అంతర్జాతీయస్థాయికి చేరాయి. ప్రపంచ చలన చిత్ర రంగంలోనే ప్రతిష్ఠాత్మకంగా
భావించే న్యూయర్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుని దర్శకుడు రాజమౌళి
అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా
పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ జక్కన్న ఈ అవార్డు అందుకున్నారు.
సినీ ప్రేక్షకులకు, ఆర్ఆర్ఆర్ టీంకు థాంక్స్ చెప్పారు. అలానే ప్రతి అడుగులోనూ
తోడుండే తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఇక ఈ వేడుకల్లో
రాజమౌళి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ధోతీ-కుర్తా
ధరించి, రెగ్యులర్ కి భిన్నంగా కనిపించారు. ఇక అవార్డు తీసుకున్న తర్వాత
అద్భుతమైన స్పీచ్ కూడా ఇచ్చారు. ఆస్కార్ రేసులో అదృష్టాన్ని
పరీక్షించుకునేందుకు ఉరకలేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఈ అవార్డు గొప్ప
ఉత్తేజాన్నిస్తోంది. ఇదిలా ఉండగా సంగీతం (ఒరిజినల్ సాంగ్) విభాగంలో నాటు నాటు
సినిమా పాట కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి మాగ్నమ్
ఓపస్ RRR నుండి విస్తృతంగా జనాదరణ పొందిన ట్రాక్ అయిన నాటు నాటుకి ఇది మూడవ
అతిపెద్ద అంతర్జాతీయ నామినేషన్ అయిన విషయం తెలిసిందే.