చాలామంది సంప్రదాయబద్ధం అంటూ నేలపై కూర్చుని భోజనం చేయడం చూస్తూ ఉంటాం.
డైనింగ్ టేబుల్, చెయిర్ ఉన్నా కూడా మన పెద్దవాళ్లు దానిపై తినడానికి ఇబ్బందిగా
ఫీలవుతారు. అందుకే.. పాత పద్ధతినే పాటిస్తూ కింద కూర్చుని తింటారు. అయితే ఈ
కాలం పిల్లలకు, పెద్దవాళ్లకు టీవీ ముందు కూర్చుని, సోఫాలు, మంచాలు, కుర్చీలు..
ఏది అనుకూలంగా ఉంటే వాటిపై కూర్చుని ఆరగించేస్తుంటారు.
కుర్చీపై కూర్చోవడం కంటే నేలపై కూర్చోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా
ఉంటుంది. కానీ, అన్ని సమయాలలో ఇది సాధ్యం కాకపోవచ్చు. నేలపై కూర్చుని
తినడానికి, చదవడానికి, వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించాలని ఆయుర్వేద నిపుణులు
సలహా ఇస్తున్నారు.ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువ సమయం కుర్చీలపైనే గడుపుతున్నారు. ఎక్కువ
గంటలు కుర్చీపై కూర్చోవడం వల్ల వీపు కింది భాగం, ప్రత్యేకంగా నడుము భాగంపై
ప్రభావం చూపుతుంది. నేలపై కూర్చోవడం అస్థిపంజర మద్దతు, భంగిమ, వెన్నెముక
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వెన్నునొప్పిని తగ్గిస్తుంది.
ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కుమార్ మాట్లాడుతూ నేలపై కూర్చోవడం కోర్
స్టెబిలిటీని మెరుగుపరుస్తుందన్నారు. ‘అలాగే తుంటి కండరాలను బలపరుస్తుంది.
అస్థిపంజరానికి మద్దతు ఇస్తుంది. శరీర భంగిమ, వెన్నెముక ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది.’ అన్నారు.