తిరుపతి : రేణిగుంట వద్ద గల శ్రీ బాలాజీ వైద్య కళాశాల, రీసెర్చ్ సెంటర్ మొదటి
సంవత్సరం ఎంబిబిఎస్ ప్రారంభ కార్యక్రమం, ఎస్వీ వైద్య కళాశాల వద్ద పూర్వ
విద్యార్థులు ఏర్పాటు చేసిన లైబ్రరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని తిరుమల
శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునే నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంకు
ఉదయం 11.20 కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
కి ఘన స్వాగతం లభించింది. వీరివెంట గవర్నర్ స్పెషల్ సి ఎస్ ఆర్ పి సిసోడియా
ఉన్నారు. జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఈ ఎం
సి క్లస్టర్ సీఈఓ గౌతమి తదితరులు ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా ఏఎస్పీ
కుల శేఖర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్,
ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్ తదితరులు
స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.