గుంటూరు : వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోపై తెలుగు దేశం సీనియర్
నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల
బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘వైఎస్.
రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని సీఎం జగన్ చాపర్లు ఎక్కటం
మానేశారా? రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రోడ్డెక్కకుండా
అడ్డుకుంటారా? నేరాంధ్ర ప్రదేశ్‌గా ముద్ర పడిన ఏపీలో పోలీసులు ఏం చర్యలు
తీసుకున్నారు? కేవలం చంద్రబాబు, తెలుగుదేశం సభల్ని అడ్డుకునేందుకు మాత్రమే
చీకటి జీవో తెచ్చారoటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతోంది. నారా లోకేష్ యువగళం
అడ్డుకునేందుకే ఈ చీకటి జీవో తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని
హరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.