విజయవాడ : హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయానికి ‘నాబార్బ్ క్రాఫ్ట్స్ మేళా-2023’ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయవాడ పటమటలోని మేరి స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నాబార్డ్ ఆధర్వంలో 3 జనవరి నుండి జనవరి 12 వరకూ నిర్వహించే 5వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాఫ్ట్ట్ మేళాలో మొదటి కొనుగోలుగా హస్త కళాకారులు చెక్కతో తయారుచేసిన జాతీయ పతాకాన్ని మంత్రి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గ్రామీణ చేతివృత్తుల వారికి మార్కెట్ మద్దతు ఏర్పాటుకు నాబార్డ్ చేస్తున్న కృషికి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అప్కాబ్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఎం. జాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ చైర్మపర్సన్ విజయలక్ష్మి, గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (జీడీసీసీ) చైర్మన్ ఆర్. రామాంజనేయులు, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, నాబార్డ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎస్. మూర్తి, హైదరాబాద్ డీజీఎం కె.వి.ఎస్. ప్రసాద్, విజయవాడ డీజీఎం ఎం.ఎస్.ఆర్. చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.