తాను గొంతు, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రపంచ మాజీ నంబర్ వన్
టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా సోమవారం ప్రకటించింది. సింగిల్స్,
డబుల్స్‌లో మొత్తం 59 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ఆమె ఆల్ టైమ్
అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరు గడించింది. “ఈ డబుల్ వామ్మీ(చెడు ప్రభావం)
తీవ్రమైనదైనా ఇప్పటికీ పరిష్కరించదగినది” అని 66 ఏళ్ల క్రీడాకారిణి ఒక
ప్రకటనలో తెలిపింది. “నేను అనుకూలమైన ఫలితం కోసం ఆశిస్తున్నాను. ఇది కొంతకాలం
దుర్వాసన వస్తుంది, కానీ నేను దానితో పోరాడతాను.” అని పేర్కొంది.నవ్రతిలోవా 2010లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించింది. ఆ తర్వాత ఆమె
శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని బయటపడింది. తిరిగి ప్రస్తుతం
క్యాన్సర్ బారిన పడింది. నవ్రతిలోవా క్యాన్సర్ స్టేజ్ 1లో ఉందని, రోగ నిరూపణ
బాగానే ఉందని, చికిత్సలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయని వైద్యవర్గాలు
తెలిపాయి. చికిత్సకు కేన్సర్ రకం స్పందిస్తున్నట్టు వారు చెప్పారు.
న్యూయార్క్‌లో ఆమె చికిత్స తీసుకోనుంది. నవంబర్ ప్రారంభంలో డబ్ల్యుటిఎ
ఫైనల్స్‌లో నవ్రతిలోవా తన మెడలో వాపు తగ్గకుండా ఉండడాన్ని గమనించినప్పుడు
క్యాన్సర్‌ని మొదటిసారిగా గుర్తించింది.