కాకినాడ : జిల్లాలోని సమస్యల ను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పోరాటం
చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. జగ్గంపేట లో
నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా సోము వీర్రాజు
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిధి
అంటే అయిదు పోలింగ్ కేంద్రాల పరిధిలొ సమస్యలను గుర్తించి స్థానికులను
సమీకరించి ఉద్యమం చేయడం ద్వారా పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీ పటిష్ఠతకు వీలు
కలుగుతుందన్నారు. ప్రధాన మంత్రి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి
శక్తి కేంద్రాల పరిధిలో విశేష సంఖ్యలో స్థానికులను సమీకరించి నిర్వహించడం
ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి
సాధ్యపడుతుందన్నారు. జాతీయ స్ధాయిలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో జాతీయ
నేతలు ఇదే విధమైన మార్గదర్శనం చేశారన్నారు. బిజెపి లైన్ లో అవగాహన
కల్పించుకుని మన ఆలోచనలకు పదను పెట్టాలని బిజెపి నేతలకు సూచించారు.
సంస్థాగతంగా పటిష్టపడాలంటే స్థానిక నాయకత్వంలో పనితీరు వేగం పెంచుకోవలసిన
అవసరాన్ని క్షేత్ర స్ధాయిలో నేతలు గుర్తించాలన్నారు. జిల్లాలో పెండింగ్
ప్రాజెక్టులను జిల్లా నాయకులు గుర్తించి అవి పరిష్కారం అయ్యేంతవరకు దశల వారీ
పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రధాన కార్యదర్శి వేటుకూరి
సూర్యనారాయణ రాజు , బిజెపి నేతలతో పాటు మహిళా మోర్చా, యువమోర్చా, కిసాన్
మోర్చా, మైనార్టీ మోర్చా జిల్లా , రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.