టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నెల్లూరు : రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం
శ్రద్ధ పెట్టట్లేదని, ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికి పైగా మహిళలపై
అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో
నిర్వీర్యమైపోయిందని ఆక్షేపించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత
నెలకొన్నాయన్నారు. అధికార పార్టీలోనూ అంతర్యుద్దం మొదలైందని బాబు
పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా
విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ
అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో
మాట్లాడారు. 2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. జగన్
పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని విమర్శించారు. వైసీపీ
అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీ ఏడాది విధ్వంసాలేనని మండిపడ్డారు. ప్రభుత్వ
విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారన్నారు. ప్రతిపక్షంలో పలుమార్లు టీడీపీ
ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదన్నారు. అందుకే జగన్ రెడ్డిని సైకో
అనేదని,
మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడని ఆక్షేపించారు.
రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గంజాయి, డ్రగ్స్
నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదు. ఈ మూడున్నరేళ్లలో 53 వేలమందికి పైగా
మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో
నిర్వీర్యమైపోయింది. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయి.
విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయి.
ప్రజలపై 40 రకాల పన్నులు మోపారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసి వసూలు
చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
గంజాయి హబ్‌గా రాష్ట్రం
దేశంలో ఎక్కడాలేని ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో
ప్రతీ రైతు మీద అప్పుందని.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని
తెలిపారు. కౌలురైతు వ్యవస్థలో అగ్రస్థానంలో ఏపీ ఉండేదని.. కానీ ఇప్పుడు కౌలు
రైతులు కూడా పారిపోయారన్నారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ
లేకుండా పోయిందని దుయ్యబట్టారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ
పెట్టట్లేదని విమర్శించారు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై
అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ముగిసింది. నెల్లూరు పర్యటన అనంతరం
ప్రకాశం జిల్లా పర్యటనకు బయల్దేరారు. మార్గమధ్యంలో కందుకూరు ఘటన మృతురాలి
కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కొండపి మండలం పెట్లూరులో రాజేశ్వరి
కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈదమూరి రాజేశ్వరి కుటుంబానికి ఆర్థికసాయం
చెక్కు అందజేయనున్నారు.