హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్
వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ
క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు
చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ
కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పవన్
ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన
ఫొటోను గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా హైదరాబాదులో
రాష్ట్రపతి శీతాకాల విడిది నేటితో ముగిసింది. ఈ మధ్యాహ్నం హకీంపేట వైమానిక
స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు.