రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల దక్షిణాది పర్యటన ముగిసింది. యాదాద్రిలో
పర్యటించిన దేశ ప్రథమ పౌరురాలు లక్ష్మీ నరసింహ స్వామి వారిని
దర్శించుకున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము
విందు ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, గవర్నర్ తమిళిసై, మండలి ఛైర్మన్
గుత్తా, సభాపతి పోచారం సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. వాయుసేన ప్రత్యేక
విమానంలో దిల్లీకి తిరుగుపయనమయ్యారు.