వాటికన్ సిటీ : పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్–16 ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వాటికన్ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొన్నాయి. 95 ఏళ్ల బెనెడిక్ట్ చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్థక్యం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వాటికన్ అధికార ప్రతినిధి మాటియో బ్రూనీ తెలియజేశారు. బెనెడిక్ట్ కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని పోప్ ఫాన్సిస్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వాటికన్ ఆడిటోరియంలో పోప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ప్రకటించారు. పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు.