దురదృష్టకరమని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ
సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన కుటుంబాలకు కేశినేని ఫౌండేషన్ తరపున
ఒక్కొక్కరికి రూ.50,000, గాయపడిన ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సహాయం
ప్రకటించారు.మరణించిన మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి
అబ్దుల్ అజీజ్
నెల్లూరు : కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు అజీజ్ ఆర్థిక సాయం : కందుకూరు లో
నిర్వహించిన నారా చంద్రబాబునాయుడు పర్యటనలో అపశృతి జరిగి తోపులాటలో కాలువలో
పడి దురదృష్టవశాత్తూ మరణించిన మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నెల్లూరు
పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్
అజీజ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నారా
చంద్ర బాబు నాయుడుపర్యటనలో అపశ్రుతి చోటు చేసుకోవడం బాధాకరమని, పలువురు
ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, చనిపోయిన వారి ఆత్మకు
శాంతిచేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు.