గుంటూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు అన్ని
ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు
జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ
రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. వచ్చే
నెల 27 నుంచి లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400
రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్
పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను తెదేపా త్వరలో
ప్రకటించనుంది. హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు
చేయాలని పార్టీ నేతలకు లోకేశ్ సూచించారు. మరోవైపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని
ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిరాశతో ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులు
ఎదుర్కొంటున్న ప్రజలు, నిరుద్యోగ యువత తమ సమస్యలు తెలిపేందుకు ‘యువగళం’
పాదయాత్ర వేదికగా నిలుస్తుందని చెప్పారు.