నంద్యాల: కార్మికులతో పాటు అన్నీ వర్గాల ప్రజలంతా ప్రభుత్వం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవడం గురించి నాయకుల అవగాహన కల్పించాలని వై ఎస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ జూపల్లె రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు సిఐటియు నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు ఇవి కొనసాగుతాయి. నంద్యాలలోని ఎన్ఐఒ కాలనీ నేషనల్ పిజి కాలేజీలో ఉన్న టి.షడ్రక్ ప్రాంగణంలో తొలిరోజు జరిగిన సభల్లో గౌరవ అతిధి గా హాజరైన డాక్టర్ జూపల్లె రాకేష్‌రెడ్డి.. ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రము లో అధికారం లో వున్నా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల కుటుంబాలకు, పిల్లల చదువులకు, మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఇలా అన్నీ వర్గాలు ఉన్నతంగా జీవించడానికి దూరదృష్టితో అనేక పధకాలను అమలుచేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన పథకాల గురించి ప్రభుత్వానికి సూచించవచ్చని నాయకుల్ని కోరారు. ఎన్ఐఒ కాలనీ నేషనల్ పిజి కాలేజీలోని టి.షడ్రక్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మహాసభలకు సి ఐ టి యూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు లతో పాటు పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండే 300 మంది ప్రతినిధులుగా ఈ సభలకు హాజరయ్యారు . మహాసభలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోనున్నారు.