ఎపిసిసి కాపు సెల్ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వర రావు
విజయవాడ : కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కృషిచేస్తుందని, కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని ఎపిసిసి కాపు సెల్ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వర రావు తెలిపారు. సోమవారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈశ్వర రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం కాపులకు ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం కాపు రిజర్వేషన్లను అమలుచేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని చెప్పిందని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కాపులకు గత ప్రభుత్వం అమలుపరిచిన 5 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ కాపు రేజర్వేషన్ల విషయంలో కార్యాచరణ రూపొందించి ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో ప్రభుత్వం రిజర్వేషన్లు అమలుపరిచే వరకు పోరాడుతామని హెచ్చరించారు.