రాజమండ్రి : ఈరోజు చాలా వినూత్నంగా మంచి మంచి చీరలతో ఈ క్రిష్మస్ ట్రీ ని
రూపొందించారు. కొత్త ఐడియా ని క్రియేట్ చేసినందుకు ముందుగా ముగ్ధ సిల్క్స్ ని
ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా
అన్నారు. దీనిని ఇంత బాగా ఏర్పాటు చేసిన మంజీర సరోవర్ ప్రీమియర్
యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సాంస్కృతిక రాజధాని అయిన
రాజమండ్రిలో మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతిరూపమైన చీరలతో ఇంత అద్భుతంగా
క్రిస్మస్ ట్రీ ని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. మొట్టమొదటి సారి ఈ ప్రయత్నం
చేసి, మన ఆంధ్రా, తెలంగాణనే కాకుండా దేశంలోనే వివిధ ప్రాంతాలకు చెందిన
ప్రఖ్యాత బ్రాండ్లు, కళాకారులు రూపొందించిన చీరలను ఇక్కడ ప్రదర్శించడం చాలా
సంతోషంగా ఉంది. ముగ్ధ సిల్క్స్ లో అన్ని వర్గాలకు అందుబాటులో, అన్ని రకాలు,
అన్ని సంప్రదాయాలకు తగ్గట్టుగా చీరలను అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయం.
క్రిస్మస్ ట్రీ ని చీరలతో చేసినా ఇందులో అన్ని మతాలు, అన్ని కులాలకు చెందిన
సంప్రదాయాలు, కళాకారులకు చెందిన చీరలున్నాయి. మన దేశంలో అన్ని కులాలు, మతాలు
ఐకమత్యంగా ఉంటాయి అని చాటిచెప్పే గొప్ప సందేశం ఈ ట్రీ ద్వారా ఇచ్చారు. మనకి ఏ
పండగైనా మనం కలర్ ఫుల్ గా చేసుకుంటూనే మన కల్చర్ ని కూడా కాపాడుకుంటూ
చేసుకుంటాం. అందులోను మన తెలుగు మహిళ అంటేనే మొట్టమొదట గుర్తొచ్చేది మన కట్టు,
బొట్టు. అందులోను తెలుగింటి ఆడబిడ్డ అనగానే ఆరనాల తెలుగుదనం ఉట్టిపడేలా కట్టే
చీరనే గుర్తొస్తుంది. చీర కడితే అమెరికాలో అయినా, ఆంధ్రాలో అయినా
ఆడవాళ్ల అందం రెట్టింపవుతుంది..అంత గొప్పతనం ఈ చీరలో ఉంటుంది. ఎందుకంటే
సింగారమనే దారంతో చేసి ఆనందమనే రంగులను అద్ది మమకారమనే మగ్గంపై నేస్తారు. ఆ
చీర కట్టే మహిళలు మడికట్టుతో పూజచేసినా, వెంకి కట్టుతో పొలం పనులు చేసినా,
నిండు కట్టుతో నడిచెలుతుంటే అందరూ దండాలు పెడతారు. ఇంకా చెప్పాలంటే చీర
పసిబిడ్డలకు కన్నతల్లిలాంటిది. కన్నీళ్లు తుడుస్తుంది. పసిపాపని
నిద్రబుచ్చేలా ఊయలలా మారుతుంది. ఎండ నుండి..వాన నుండి పిల్లలను కాపాడుతుంది.
ఇలా చీర ఎంత అందమో అంత అవసరం కూడా.ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ కి అందాన్నిస్తుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని
కాపాడుతుంది. అందుకే ఈ తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగు సమాజం ఉన్నంతవరకు
తెలుగింటి మహిళలు చీర సంప్రదాయాన్ని కొనసాగిస్తారు..కొనసాగించాలి. పోటీ
ప్రపంచంలో వెస్టన్ కల్చర్ ఎంత విస్తరించినా ఆడపిల్ల అమ్మని మర్చిపోదు…చీరని
మర్చిపోదు. కనుక ముగ్ధ సిల్క్స్ వారికి, మంజీర సరోవర్ ప్రీమియర్ వారికి
మరోసారి ఇంత మంచి కాన్సెప్ట్ తో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు
అభినందిస్తున్నా. ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ ఏటా ఇలా మన తెలుగు సంప్రదాయానికి
ప్రతిబింబమైన చీరల విశిష్టతను తెలియజేసేలా రాబోయే తరాలకు ఈ చీర
గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని
కోరుకుంటున్నానని రోజా అన్నారు.