భట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ
విజయవాడ : గత 10 సంవత్సరాలుగా అలుపెరుగక చేసిన పోరాట ఫలితమే “భట్రాజు
పొగడ్తలు”అనే పదాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసినందుకు సీఎం జగన్ కు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
పాలగిరి చంద్రకళ ఓ ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. భట్టు దీవెన బ్రహ్మ దీవెన
అని ఆర్యోక్తి కవులుగా, కళాకారులుగా, అవధానులుగా, ఘనాపాటిలు గా అవపోసన
పట్టినటువంటి కులమైన భట్రాజు కులాన్ని పనికిమాలిన ఉపమాన, ఉపమేయాలకు సమాజంలో
ఉండేటటువంటి రాజకీయ నాయకులు, సినిమా, సీరియల్స్ వాళ్ళు, ఇతరులు మమ్మల్ని
“భట్రాజు పొగడ్తలు” అంటూ అవహేళన చేస్తూ మా కులాన్ని మానసిక క్షోభకు
కారణమవుతున్నారు. నేటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా గౌరవాన్ని నిలబెట్టే
విధంగా “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని నిషేధిస్తూ జీవో జారీ చేసినందున
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా భట్రాజు కులానికి “భట్రాజు
పొగడ్తలు” అనే పద నిషేధాన్ని కానుకగా మాకులానికి ఇచ్చినందుకు వారికి యావత్
భట్రాజు కులం తరుపున నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని
దీవిస్తున్నాము. భట్రాజు పొగడ్తలు అని నిషేధించడానికి మా సంఘం తరఫున
ప్రభుత్వానికి వారదులుగా ఉండి జీవో జారీచేసేందుకు కృషి చేసిన లేళ్ల అప్పి
రెడ్డికి ,గడికోట శ్రీకాంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు అలుపెరుగక నేను చేసిన ఈ పోరాటానికి మద్దతు
తెలిపిన యావత్ భట్రాజు జాతికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.