బాలాయపల్లి-వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
అడవిలో కంటైనర్ ఉందని పోలీసులకు గ్రామ స్తులు సమాచారం ఇవ్వడంతో ఇటు రెవిన్యూ అటు పోలీస్ శాఖ అధికారులు పరుగులు తీసిన సంఘటన మండలంలోని నిడిగల్లు గ్రామ పంచా యితీ అడవి సమీపం బోయినగుంట వద్ద చోటు చేసుకుంది.తహసిల్దార్ పుల్లా రావు కథనం మేరకు
గత మూడు రోజుల నుంచి కంటైనర్ బోయిన గుంట అటవీ ప్రాంతంలో ఉందని గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు సహాకారంతో సంఘటన స్థలానికి వెళ్లి కంటైనర్ కి ఉన్న తాళం పగులగొట్టి చూడగా ఖాలిగ ఉండింది.దింతో పలు అనుమానాలు వెల్లువెత్తాయి.
తలపెట్టుకుని పోలీసులు :-
కంటైనర్ ఎందుకు అడవిలో పెట్టారు.ఎమి జరిగి ఉండవచ్చు , ఎలక్షన్ కి ఏమైన నగదు,ముందు తరలించారా..అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టుతున్నారు.ఈకార్యక్రమంలో ఎస్ ఐ మహబూబ్ సాహెబ్,అర్ ఐ పూర్ణ, విఆర్ఓ శ్రీనివాసులురెడ్డి, తదితరులు ఉన్నారు.
ఫోటో:-అడవిలో కంటైనర్
ఫోటో:-పరిశీలిస్థున్న రెవిన్యూ, పోలీసులు