వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోటీని రద్దు చేసుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజల సంక్షేమం మనుగడాలంటే …1.ఈ రాష్ట్రంలోనే పాలన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచక పాలన… 2.దళిత గిరిజన మానప్రాణాలకు రక్షణ కరువు… 3.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ 28 పథకాలు రద్దు… 4.పల్లె నుండి పట్నం దాకా సమిష్టి అభివృద్ధి కరువు … వివిధ రకాల ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి అనే నినాదంతో ఈరోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గద్దల మునెయ్య ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి గెలుపుకు కలిసి మద్దతు ప్రకటించడం జరిగినది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని వివిధ రకాల ప్రజా సమస్యలను వారి దృష్టికి వినతి పత్రం రూపంలో తీసుకొని పోవడం జరిగిందిఈ కార్యక్రమంలో AP.ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులుSk రఫీ.గద్దల కృష్ణయ్య .కావూరు మునెయ్య. ప్రసాద్.మరియు టిడిపి నాయకులు వేముల మల్లికార్జున నాయుడు. ముద్దా మునస్వామి రెడ్డి. రంగినేని రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు