వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
మేనిఫెస్టో నిరుద్యోగులు, పేదలకు వరం
త్వరలో వెంకటగిరి అభివృద్ధి కార్యాచరణ ప్రకటిస్తాం
విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు , ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి
ఆదివారం వెంకటగిరిలో సీఎం జగన్ సభ పూర్తి విజయవంతంగా జరిగిందని, నిప్పులు చెరుగుతున్న ఎండను లెక్కచేయకుండా సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్సిపి శ్రేణులకు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం గురుమూర్తి లు తెలియజేశారు. సోమవారం స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్ జే ఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ 43 డిగ్రీల ఎండ వేడిమిని లెక్కచేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానంతో అశేష జనవాహిని హాజరు కావడం, వారికి ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు తలెత్తకుండా సభ విజయవంతం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం గురుమూర్తితో కలిసి త్వరలో వెంకటగిరి అభివృద్ధిపై రూట్ మ్యాప్ ను ప్రకటిస్తామన్నారు. వెంకటగిరిలో ఈనెల 25న జరిగిన తన నామినేషన్ సందర్భంగా వెంకటగిరి చరిత్రలోనే లేనివిధంగా నిర్వహించిన నామినేషన్ ర్యాలీ, సీఎం సభకు ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన జనం స్పందన చూసి ప్రజా మద్దతు ఎవరికీ ఉందో అందరికీ అర్థమైంది అన్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు అదే ఉత్సాహంతో పనిచేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా డాక్టర్ ఎం గురుమూర్తిని గెలిపించాలని కోరారు.
వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అన్ని వర్గాలకు వరం
వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు వరమని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెఇ మేనిఫెస్టో ద్వారా అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈ బీసీ నేస్తం, వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ పెన్షన్ వంటి పథకాలు పెంపు తో పేదలకు మరింత ఆర్థిక భరోసా కలగబోతుందన్నారు. ఇక రూ ఇరవై ఐదు వేలు కన్నా తక్కువ వేతనం పొందే కాంట్రాక్టు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందపరచడం చారిత్రక అంశమని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏ హామీలు ఇవ్వకనే ప్రజలు 151 సీట్లు అందించారని ఐదేళ్లుగా ప్రజా రంజిక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ఈ సారీ మరిన్ని ఓట్లు సీట్లు ఇవ్వడం తద్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి విత్తనాలు నాటారని రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు వాటి ఫలాలు అందుకోబోతున్నారని వివరించారు.
వైద్యరంగంలో ఏపీ దేశానికే రోల్ మోడల్ కానుంది
* తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి వెల్లడి
సీఎం వైఎస్ జగన్ వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ కానుందని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తెలిపారు. ఆస్పత్రులలో మౌలిక వసతుల పెంపుకు నాడు నేడు, నాణ్యమైన , ఆధునికవైద్యం ప్రజల ముంగిటకు చేర్చేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని ప్రశంసించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఈ ఐదేళ్లలో 54 వేల ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకమన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీలు, భవిష్యత్తులో మరో 12 మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ గుండె సంబంధించిన ప్రత్యేక వైద్యశాలలు పేదలకు ఖరీదైన వైద్యం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా అందించనుందని వివరించారు. జగనన్న ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఎస్సీల సంక్షేమం కోసం 69 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.