డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంకటగిరి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభకు డక్కిలి మండలం నుండి ప్రతి పల్లి నుండి భారీగా తరలి వెళ్లారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు జగన్ సభకు రావడం జరిగింది. మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు జనం తరలింపులో సమిష్టి కృషి చేశారు. ప్రతి పల్లి నుండి వైయస్సార్ కాంగ్రెస్ జెండాలు చేతపట్టి నినాదాలతో పోరెత్తించారు.