డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :సార్వత్రిక ఎన్నికలలో మండల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా తమ ఓటును వేయడానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కేంద్ర బలగాలు, బెటాలియన్, స్థానిక పోలీసులు పూర్తి భద్రతలను చేపడుతున్నట్లు డక్కిలి సబ్ ఇన్స్పెక్టర్ చౌడయ్య తెలియజేశారు. శనివారం కేంద్ర పారా మిలిటరీ బలగాలతో దేవుడు వెల్లంపల్లి, వెంబులూరు, డి వడ్డిపల్లి, దేవులపల్లి, మాధవాయపాలెం గ్రామాలలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ చౌడయ్య మాట్లాడుతూ ఎలక్షన్ సందర్భంగా ఇలాంటి గొడవలకు తావు లేకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు, అసాంఘిక వ్యక్తులు, రౌడీషీటర్స్, రాజకీయ పార్టీల వ్యక్తులు పట్ల ప్రత్యేక నిఘా ఉంచినట్లు చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ, ప్రజల భద్రత కోసం చట్ట పరిధిలో ఎలాంటి చర్యలు కైనా వెనుకాడది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో పాటుస్థానిక పోలీసులు పాల్గొన్నారు.