వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
సీఎం సభ ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరి త్రిభుని సెంటర్లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక నేదురుమల్లి నివాసం ఎన్ జే ఆర్ భవన్ లో తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి, వైసిపి క్రియాశీలక నాయకులు కే ధనంజయరెడ్డి , కలిమిలి రాంప్రసాద్ రెడ్డి , పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరిలో నిర్వహిస్తున్న సభ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటకు సీఎం వెంకటగిరి కి చేరుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని తిరిగి రెండున్నర గంటలకు తిరుగు ప్రయాణం అవుతారని తెలియజేశారు. నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, ఎండల ప్రభావం నుండి ఇబ్బందులు పడకుండా పార్టీ శ్రేణులు వారికి నీరు, మజ్జిగ వంటి ఉపశమనాలు అందించే సహాయంగా ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అమలు చేసిన ఘనత జగన్ దే…
ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసి చూపిన నాయకుడు దేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.