ఆత్మీయ సమావేశానికి అనూహ్య స్పందన.
మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వెంకటగిరి నియోజకవర్గం లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే గా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర వైసీపీ నాయకులు మాదాసు గంగాధరం పిలుపు నిచ్చారు . నన్ను ఆదరించిన విధంగా నే రామ్ కుమార్ రెడ్డి ని ఆదరించాలని చెప్పారు.కలువాయి మండలం కుల్లూరు లో ఆయన మండలం లోని తన కుల నాయకులు, బీసీ లు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి మండలం నుంచి అన్ని కులాల కు సంబందించిన 200 మంది హాజరు అయ్యారు.
వచ్చే నెల లో ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఫ్యాన్ గుర్తు కు ఓట్లేసి గెలిపించాలని తెలిపారు.ఈ సందర్బంగా సమావేశానికి హాజరు అయిన నాయకులందరు మాదాసు గంగాధరం వైసీపీ పార్టీ కండువాలను కప్పి సాధరం గా పార్టీ లోనికి ఆహ్వానించారు. మండలం లో జరిగిన రాజకీయ సమీకరణాలకు తల తనేలా ప్రతి నాయకుడు పని చేయాలని కోరారు. పెతందారులకు, పేదలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.రామ్ కుమార్ రెడ్డి ద్వారా ఏ సమస్య ఉన్న చేయించే బాధ్యత నాది అని వారికీ మాదాసు హామీ ఇచ్చారు.రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయితే సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఆయన ను ఆదరించి మంచి పదవి ఇస్తారని తెలిపారు.
రామన్న విజయమే లక్ష్యం.
వెంకటగిరి ఎమ్మెల్యే గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గా గురుమూర్తి లను గెలిపించుకోవడమే లక్ష్యం గా పెట్టుకొన్నామని మండల జేసీఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ చెప్పారు. ఆత్మీయ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు. మీకు అండగా నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తు కు ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ అంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ ఆదిలక్ష్మి, రిటైర్డ్ డాక్టర్ ఓబుల్ రాజు, నాయకులు సుబ్బారాయిడు,పాల్గొన్నారు.