వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గాను వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి అభిమానులు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మద్దతు తెలిపారని వారంతా జగనన్న వెంటనే ఉన్నారని తెలియజేశారని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన రామ్ కుమార్ రెడ్డికి వారి మద్దతు తెలిపారని ఈ సంఖ్యాబలమే నిన్నటికి ఈరోజుకి తేడా చూసామని ఇదే సంఖ్యాబలంతో మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు మద్దతు జిల్లాలోనే అత్యధికంగా మెజారిటీ సీట్లు గెలిపించి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచి రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తారని ఈ జన సమూహాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఎవరిది గెలుపో అర్థమై ఉంటుందని చెప్పారు