వెంకటగిరి రూరల్ మండల పర్యటనలో నేదురుమల్లి పిలుపు
(వెంకటగిరి రూరల్` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
వైపస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధితోపాటు తన తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి చేసిన అభివృద్ధిని చూసి తనకు పట్టం కట్టాలని వైసిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఆయన వెంకటగిరి రూరల్ మండలంలోవిశ్వనాదపురం, గుల్లసముద్రం, కలపాడు గ్రామాల్లో వైసిపి సీనియర్ నాయకులు కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, వైసిపి నాయకులు డాక్టర్ బి మస్తాన్ యాదవ్‌లతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేదురుమల్లి కుటుంబం ప్రతి పల్లెలో అభివృద్ధి బీజాలను నాటి ఒక మంచి మార్గాన్ని చూపించిందని, వారిలాగానే తాను కూడా అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మంచి మార్పుతీసుకురావాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు.