` లండన్‌లో చదివి వచ్చిన యువ మహిళను పక్కన పెట్టి
7వ తరగతి చదివిన లారీ వ్యాపరస్తుడికి టిక్కెట్ ఎందుకిచ్చినట్లు?
` మాజీ అయినా ఎమ్మెల్యేగా పనితీరు బాగాలేదనే పక్కనపెట్టి ఆనాడు ఆనంకు ఓటేశాం..
` ఇప్పుడు ఇద్దరూ ఒక్కటే అని తెలిసిందంటున్న జనం
లక్ష్మీసాయి ప్రియ జనం మధ్య తిరిగింది నాలుగురోజులే కావచ్చు. కానీ జనంతో బాగా దగ్గరైంది. ప్రారంభంలో రాజకీయాలు ఇష్టం లేకపోయినా మెల్లగా అలవాటు చేసుకున్నది. కార్యకర్తలు నాలుగడుగులు ముందుకేసి మీరు అలా వుండాలి ఇలా వుండాలని చెప్పినా నేనిలాగే వుంటానని నిక్కచ్చిగా చెప్పింది. తన తండ్రి కురుగొండ్ల లాగా కాదని, తనకంటూ కొన్ని విలువలున్నాయని పరోక్షంగానే చెప్పింది. లక్ష్మీసాయిప్రియ లండన్‌లో చదివిన విద్యావంతురాలు, యువతి. అలాంటి ఆమెకు టిక్కెట్ ఇచ్చినపుడు తెలుగుదేశం పార్టీ అభిమానులంతా ఎంతో సంతోషించారు. ఆమెను తిప్పుతూనే తెరవెనుక ప్రయత్నాలు చేసి కూతురి టిక్కెట్‌ను తండ్రి కురుగొండ్ల రామక్రిష్ణ లాక్కున్నాడని తెలిసిం జనం అతడ్ని తిడుతున్నారు. ఆమెకు మాత్రం ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది. ఒక్కసారిగా టిక్కెట్ లాక్కోవడంపై ఆమె కొంత మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆరోజున ఎమ్మెల్యే రామక్రిష్ణ వొట్టి మాటలు తప్ప చేసిందేమి లేదనే ఆనం రామనారాయణరెడ్డికి ఓటేశాం అని, అయితే ఇద్దరూ ఒక్కటేనని తెలిసి ఈసారి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా వున్నామని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.