వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెరిపే లక్ష్యంగా జగనన్న మళ్లీ సీఎం చేసుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి రూరల్ మండలం నాయకులకు సూచించారు. నేదురుమల్లి నివాసం లోని N. J. R భవనంలో వెంకటగిరి రూరల్ నేతలతో సమీక్షించారు. గ్రామాల్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్ సీపీ కార్యకర్తను సమన్వయం చేసుకొని ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎన్నికలకు మూడు వారాల సమయం మాత్రమే ఉందని ఈ మేరకు ప్రతి ఒక్కరు పార్టీ కోసం శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూతులు గత పోల్ కన్నా అత్యధిక శాతం ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కి 38 వేళ్ళ ఓట్లు మెజార్టీ వచ్చిందని ఈ ఎన్నికల్లో అంతకుమించి మెజార్టీతో నేదురుమల్లి రామన్నను గెలిపించుకుందామని సూచించారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని తెలియజేశారు.