వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్.. వైఎస్ఆర్సిపి బహిష్కృత నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు *మక్కిలి రామచంద్రారెడ్డి (MRC రెడ్డి), వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి కలిమిలితో చర్చల్లో పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్సి రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభిప్రాయ బేధాల కారణంగా కొంతకాలంగా కలిమిలి పార్టీకి దూరంగా ఉన్నారని వాటిని పరిశీలించాలని రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరగా 15 రోజుల వ్యవధి అడిగినట్లు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీలోనే అసంతృప్తి వాదులతో చర్చలు జరిపి సవరించినట్లు తెలిపారు రెండు రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి కలిమిలితో కలిసి మాట్లాడతారని పార్టీ కోసం పని చేసే వారిని ఎప్పుడూ వదులుకోదని పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన ఎలాంటి నాయకులను పార్టీ వదులుకోరని. వారికి తగిన ప్రాధాన్యం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు అనంతరం నియోజకవర్గం 163 పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ కలిమి రాంప్రసాద్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరం విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకో పోవడంతో వారు వెంటనే స్పందించి తిరిగి పార్టీలోకి తీసుకోమని ఆదేశించడంతో ఈరోజు పార్టీలో తీసుకున్నట్లు తెలిపారు.. అనంతరం కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మొదటినుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి పని చేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసి కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకుంటానని తెలిపారు