డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శుక్రవారం లెక్కల మండలంలో దగ్గవోలు, కె.బి పల్లి, పాతనాలపాడు, లింగసముద్రం,డక్కిలి, సంగనపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ప్రతిచోట ఆయనకు దారి పొడవునా పూల వర్షం, డప్పులు బాణాసంచా మోతలతో హోరెత్తి ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభి అనురాగాలు ఓట్లు రూపంతో నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉందని, నమ్మినవారికి నేదురుమల్లి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని, అభివృద్ధి అనేది నేదురుమల్లి కుటుంబానికి పర్యాయపదమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నూతన శకానికి నాంది పలికారని, ప్రజల వద్దకు పాలన, సంక్షేమ పథకాలు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేయడం, పదవులలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎవరి వాటవారికి అందజేయడం అది ఒక సాహసం అన్నారు. తిరిగి వైకాపా జగన్ పాలన వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. చాకలపల్లి గ్రామంలో 20 కుటుంబాలు, సంగనపల్లి పంచాయతీలో 50 కుటుంబాలు వైకాపా లోకి రావడంతో వారిని సాధారంగా కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డక్కలి ఎంపిపి గోను రాజశేఖర్, మాజీ ఎంపీపీ వెలికంటి చెంచయ్య,సర్పంచ్ సుజాత,కోళ్లపూడి వేణుగోపాల్, మస్తాన్ నాయుడు, అరుణాచలం, ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు, పి శంకర్ రెడ్డి, పి గోపాల్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి,కోటేశ్వరరావు,సుధాకర్, పరంధామ నాయుడు, మాధవ నాయుడు, వేముల మల్లికార్జున్, రాపూరు చిరంజీవి, గోవర్ధన్ నాయుడు, వైకాపా మండల కన్వీనర్ చింతల శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, దువ్వూరు రవీంద్రారెడ్డి, మామిడి శ్రీనివాసులు,రాంబాబు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు