దేవుడు వెల్లంపల్లి లో వైకాపా ప్రచారం
డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా గత ఎన్నికలలో వచ్చిన ఫలితాల కంటే కాస్త మెరుగైన ఆధిక్యతతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకాన్ని డక్కిలి మండల వైకాపా నాయకులు ముక్తకంఠంతో ప్రకటిస్తున్నారు. బుధవారం దేవుడు వెల్లంపల్లిలో తమ ప్రచారాన్ని కొనసాగించారు. వెంకటేశ్వరపురం, చిన్న కుప్పాయిపాలెం, పెద్ద కుప్పాయపాలెంలో గడపగడపకు తమ ప్రచారన్ని చేపట్టారు. గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు సేవలను ప్రజలకు వివరించారు. గత కొద్దిరోజులుగా మండలంలో అక్కడక్కడ వైకాపా నుండి టిడిపిలోకి వెళ్లడం ఎన్నికల ముందు సర్వసాధారణమని అయినా వైకాపాకు పెద్దగా నష్టమేమీ ఉండదని మండలం మొత్తం మీదగా సుమారు మూడువేల ఓట్ల మెజార్టీతో వైకాపా తన సత్త చాటడం ఖాయమని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైకాపా ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ సుజాత, కోళ్లూరు బాలకృష్ణ, మాజీ ఎంపీపీ వెలికింటి చెంచయ్య, చింతల శ్రీనివాస్ రెడ్డి, నార్రవుల. వేణుగోపాల్ నాయుడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు,రాపూరు చిరంజీవి, ఎమ్మెల్ నారాయణరెడ్డి,సామాధి చెంచయ్య, బెంగళూరు కొండయ్య, మాధవ్ నాయుడు,మామిడి శ్రీనివాసులు, గోవర్ధన్ నాయుడు, మామిడి ప్రభాకర్, సుబ్బు, అనిల్ కుమార్ యాదవ్,బండి రమేష్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.