డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార హోరు సందర్భంగా మంగళవారం మండలంలోని వెంబులూరు పంచాయతీలోని మిట్ట వడ్డీపల్లి, కమ్మపల్లి, తోపుగానపల్లి, వెంబలూరు గ్రామాలలో మండల వైకాపా నాయకులు స్థానిక నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ సేవలు, పథకాలు ప్రజలకు నేరుగా అందిన విధానం తదితర అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైకాపాభివృద్ధిగా గెలిపించుకోవాలని ఈ ప్రాంత అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్రవుల.వేణుగోపాల్ నాయుడు, పులకంటి రామారావు, కొమ్మినేని కోటి, చింతల శ్రీనివాసులు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి,కోళ్ల పూడి. వేణుగోపాల్, ఎమ్మెల్ నారాయణరెడ్డి, రాపూరు చిరంజీవి, దువ్వూరు రవీంద్రారెడ్డి, సుబ్బు,బండి. రమేష్ రెడ్డి, దందోలు. పెంచల నారాయణరెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.