కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ఉగాది పర్వదిన సందర్భంగా కలువాయ హిందూ ధర్మ పరిరక్షణ సమితి, సమరసత సేవా ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో కలువాయిలోని శివ సాయి కాలేజీ మండల స్థాయి లో విద్యార్థులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం నుంచి 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భగవద్గీతలోని పదవ అధ్యాయం విభూతి యోగంలని శ్లోకాలను విద్యార్థులు పఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మండల విద్యాశాఖ అధికారులు బాలకృష్ణారెడ్డి, శేషగిరిరావు, నరసింహారావు,ప్రసాదు, రాఘవరెడ్డి, కలువాయి హిందూ ధర్మ పరిర్షణ సమితి, సమరసత సేవా ఫౌండేషన్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు విజేతలకు ప్రోత్సహక బహుమతులు అందజేశారు.