కలువాయి మండలం లో సుడిగాలి పర్యటన.
రామన్నా ను ఆదరించండి.
మీ అందరికి అండగా ఉంటా
వైసీపీ నియోజకవర్గం నాయకులు మస్తాన్ యాదవ్.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
కలువాయి మండలం లో వైసీపీ నియోజకవర్గం నాయకులు బోలిగర్ల మస్తాన్ యాదవ్. సుడిగాలి పర్యటన చేశారు. తిరుమలపాడు, పర్లకొండ, చీపినాపి, కలువాయి గ్రామాల్లో ఆయన తిరిగారు. ఈ సందర్బంగా బీసీ నాయకులు ఇళ్ల కు వెళ్లి భరోసా ఇచ్చారు. వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మంచి మనిషి, సహృదయలు, ఎన్నికల్లో రామన్న ను మనం గెలిపించుకోవాలి. అందరు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. అ లందరికి నేను తోడుగా ఉంటానని బీసీ లకు భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా బీసీ నాయకులను ఆయన తనదైనా శైలి లో కలిశారు.కలువాయి మండలం లోని మస్తాన్ యాదవ్ తన అనుచరులు కలిసి మీకు తోడుగా నేను ఉన్నాను. అందరం రామన్న ను గెలిపించుకుంద్దాం అని పిలుపు నిచ్చారు. టీడీపీ అభ్యర్థి కోడెపాటి లక్ష్మి సాయి ప్రియ ఓటమే ధ్యేయంగా పని చేయండి అని కోరారు. ఈ సందర్బంగా మస్తాన్ యాదవ్ ను గ్రామాల్లో బీసీ నాయకులు శాలువాల తో ఘనంగా సత్కరించారు.
ఆయన వెంట సంకల రఘు యాదవ్, పర్లకొండ సర్పంచ్ కేశవులు, మాజీ సర్పంచ్ సంకల రత్నయ్య యాదవ్. తిరుమలపాడు సర్పంచ్ కృష్ణ యాదవ్, చీపినాపి మాజీ సర్పంచ్ కృష్ణయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.