డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంబులూరు గ్రామపంచాయతీ సచివాలయ ప్రాంగణంలో వేసవి ఎండలు ఉదృతి సందర్భంగా బుధవారం తహిసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు, సచివాలయానికి వివిధ పనుల కోసం నిరంతరం వచ్చే ప్రజలు, అక్కడ పనిచేసే సిబ్బంది దాహార్తిని తీర్చుటకు మట్టి కుండలో నీరు చాలా శ్రేష్టమని తాహిసిల్దార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి నరసింహులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, సచివాల సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.