డాక్టర్ శేషమనాయుడు ఆధ్వర్యంలో చేరిక
I నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సాదర ఆహ్వానం
(బాలాయపల్లి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
బాలాయపల్లి మండలం వెంగమాంబపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం నాడు వెంకటగిరిలోని డాక్టర్ శేషమనాయుడు, వెంగమాంబపురం సర్పంచ్ ఆధ్వర్యంలో వైసిపిలో చేరారు. వారికి వైసిపి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వైసిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మే నెలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలో తన విజయానికి శక్తిమేరకు కృషి చేయాలని వారికి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో జనం గుండెల్లో కొలువుదీరిన వైపస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన ప్రతి పల్లెల్లో ప్రజలకు వైసిపి అండగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వెందోటి మధుసూదనరెడ్డి, జయంపు సొసైటీ అధ్యక్షులు వి. కార్తీక్ రెడ్డి, వైసిపి నాయకులు నెమళ్ళపూడి సురేష్‌రెడ్డిలు పాల్గొన్నారు.