డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : డక్కిలి మండలంలోని సంగనపల్లి, బ్రాహ్మణపల్లి లో వైకాపా మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది, ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసినటువంటి పనులు, పథకాలనువారికి వివరించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక వైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకవైపు ఉన్నారని అయినా ప్రజలు ఆశీస్సులతో ఈసారి ఎన్నికలలో కూడా వైకాపా తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని జగనన్న విజయం ప్రజా విజయంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగనపల్లి గ్రామ సర్పంచ్ చిరంజీవి, జే సి ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, దాసరి పోలయ్య యాదవ్,జానకిరామ్, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, గోవర్ధన్ నాయుడు, అరుణాచలం, దువ్వూరు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, పెంచల నారాయణరెడ్డి,కోళ్లపూడి. వేణుగోపాల్,రామారావు,సుధాకర్,బండి రమేష్ రెడ్డి, తంబీశెట్టి.రమేష్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.