వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
పింఛన్ కోసం వచ్చి మృతి చెందిన వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారు పేట కు చెందిన చేనేత కార్మికుడు వెంకటయ్య కుటుంబాన్ని మంగళ వారం వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. వెంకటయ్య కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. వయోవృద్ధులు వికలాంగులకు ఇంటివద్దె పింఛన్ అందించే కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. రెండు నెలల పాటు వాలంటీర్ల ద్వారా పింఛన్ ను ఇంటికి అందించే కార్యక్రమాన్ని నిలిపినంత మాత్రాన టిడిపి విజయం సాధించినట్లు కాదని వయోవృద్ధుల గోడు పట్టుకొని ప్రతిపక్ష పార్టీకి తగిన గుణపాఠం ప్రజలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు..