డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండలం లింగసముద్రం గ్రామ సర్పంచ్ పారి వెంకటసుబ్బయ్య, డక్కిలి గ్రామ ఉపసర్పంచ్ భారతాల లక్ష్మీ తులసి, వార్డు మెంబర్లు జయమ్మ, చిన్న రమణయ్య, పద్మమ్మ దళిత లీడర్ సర్వేపల్లి రత్నయ్య మరియు 10 కుటుంబాల వారు వైకాపా నుండి టిడిపి కండువా కప్పుకున్నారు. అదేవిధంగా దేవులపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకటరమణారెడ్డి, లింగసముద్రం వేముల నాగయ్య నాయుడు సోమవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో వీరంతా టిడిపిలోకి రావడం జరిగింది. డక్కిలి గ్రామపంచాయతీ ఇప్పటికే వైకాపా నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారీగా ఆ గ్రామం నుండి టిడిపిలోకి వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురయ్యారు. 5వ తేదీ వెంబులూరు, దేవుడు వెల్లంపల్లి, మాధవాయపాలెం, వెలికల్లు, పలుగోడు, అల్తూరుపాడు మరి కొన్ని గ్రామాల నుండి వైకాపా నుండి టిడిపిలోకి చేరికలు ఉంటాయని అందుకు డక్కిలి వేదికగా అన్ని ఏర్పాట్లు జడ్పిటిసి రామచంద్ర నాయుడు, టిడిపి మండల ప్రెసిడెంట్ పోలం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి, చెలికిం భాస్కర్ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. తన కుమార్తె సాయి లక్ష్మీ ప్రియ గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని గెలుపే లక్ష్యంగా కురుగొండ్ల రామకృష్ణ పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, పోలం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి, చెలికం భాస్కర్ రెడ్డి, డక్కిలి చంద్ర రెడ్డి, మచ్చల వేణుగోపాల్, వెంకటాద్రి, పి పి చౌదరి, రమేష్ నాయుడు, చిరంజీవి, పిల్లి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.