డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్: డక్కిలి గ్రామ యువ వైకాపా నేత ఎన్ఆర్ఐ దందోలు పెంచల నారాయణరెడ్డి వెంకటగిరి సమన్వయకర్త వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని తన బంగ్లాలో కలవడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో డక్కిలి పంచాయితీలో వైకాపా విజయం కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తానని రామన్నకు పెంచల నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.ఇప్పటికే డక్కిలి గ్రామపంచాయతీ వైకాపా పరంగా చాలావరకు నాయకత్వ సంక్షోభంలో ఉన్నందువలన అక్కడ టిడిపి బలంగా ఉంది. ఇప్పటివరకు ఏ ఎన్నికలలో టిడిపి మెజార్టీ సాధించిన దాఖలాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో వైకాపా డక్కిలి పంచాయతీలో తనసత్తా చాటాలని అందుకు తన పూర్తి సహకారం అందించుతానని రామ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుకు పెంచల నారాయణరెడ్డి సింగపూర్ లో తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలిక విరామం ఇచ్చి మరి కొన్ని రోజుల్లో స్థానికంగా ఇక్కడే ఉండి ఎన్నికలు పూర్తయింతవరకు పనిచేస్తానన్నారు.