డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కె.సాయి లక్ష్మి ప్రియ శుక్రవారం సాయంత్రం డక్కిలి మండలం ఆల్తూరుపాడు గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన తండ్రి కురుగొండ్ల రామకృష్ణను మీరంతా ఆదరించినట్లుగా నన్ను కూడా మీ దీవెనలు మీ మద్దతుతో వెంకటగిరి టిడిపి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఆమె మాట్లాడారు. ఆల్తురుపాడు రిజర్వాయర్ పనులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి నీటి కష్టాలను తీరుస్తానన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ప్రజల కష్టాలు నాకు తెలుసని వాటన్నిటిని పరిష్కరిస్తానన్నారు. సాయి లక్ష్మి ప్రియ ఎన్నికల ప్రచార సందర్భంగా గ్రామానికి చెందిన ఐదు దళిత కుటుంబాలు టిడిపిలో చేరడం జరిగింది. ఆల్తూరుపాడు వెల్లంపల్లి, చీకరేనిపల్లిలో ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె వెంట మండల టిడిపి అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, చెలికం భాస్కర్ రెడ్డి, ముద్ద శివారెడ్డి, కుమార్ యాదవ్, వేముల మల్లికార్జున్ నాయుడు, మునస్వామి రెడ్డి,శివ,పారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.