బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని గోట్టికాడు గ్రామంలో నేల రోజుల గా ఉన్న తాగునీటి సమస్యను మండల విస్తరణా ధికారి శ్రీనివాసులు గురువారం పరిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటికి సంబంధించిన పైపులేన్ గత నెలరోజుల క్రితం పగిలిపోయింది. గ్రామంలో తాగునీటికి అల్లాడు తున్నామని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకు రావడంతో జెసిబి తీసుకొచ్చి పైపులైను మరమ్మ తులు చేయడం జరిగిందని చెప్పారు. సచివాలయం పరిధిలో ఏఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే మండల పరిషత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సచివాలయం సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఫోటో :- జెసిబి తో పైపులైను పనులు చేపడుతున్న దృశ్యం