బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వేసవి సమీపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో తాగినీటి సమస్య లేకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టా ల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని తాహసిల్దార్ పుల్లారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాగునీటి సమస్య పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతాయో ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తాగునీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వస్తే ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ అధి కారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా చేతి బోర్లు మర మ్మత్తులను వెంటనే చేపట్టాలన్నారు. మంచినీటి పథకం సంబంధించి మోటర్లు మరమ్మతులకు గురైతే ఒక్క రోజుల్లో మరమతలు చేయాలని ఆదేశించారు.
వాలెంటీర్లు ప్రచారాలకు దూరంగా ఉండాలి. :-
పింఛన్లు పంపిణీ చేస్తున్న సమయంలో వాలెం టర్లు ఫోటోలు తీసిన, గ్రూపులలో పెట్టిన శాఖ పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ అరుణ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రచారంలో పాల్గొన్న, పింఛన్లు పంపిణీ చేస్తూ ఫోటోలు తీసినట్లు తమ దృష్టికి వస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ, ఈ ఓ పి ఆర్ డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పోటో:- మాట్లాడుతున్న తహసీల్దారు