బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ గౌడ సంఘం అధ్యక్షుడు గా తాళ్ళ. వెంకటేష్ గౌడ్ ని నియమి స్తున్నట్లు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామ కృష్ణ అధ్యక్షతన గురువారం నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి గౌడ కులస్తులు అత్యంత ఆదరణ చూపేవారని, ఈ 2024 ఎన్నికల్లో కూడా గౌడ సోదరులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి తోడ్పడాలని, కష్టపడి పని చేసే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గౌడ సంఘం తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తోయజాక్షులు గౌడ్ మాట్లాడుతూ గౌడ్ల అభివృద్ధికి తోడ్పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు, భవిష్యత్తులో గౌడ కులస్తులకు మేలు చేయబోయేది కూడా టిడిపి పార్టీ అన్నారు,
నమ్మకంగా ఉంటా :-
నాపై నమ్మకంతో నియోజకవర్గ అధ్యక్ష బాధ్యత ను అప్పగించిన పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్య వాదాలు వెంకటేష్ గౌడ్ తెలిపారు, నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన
న్నారు.ఈ కార్యక్రమంలో బాలాయపల్లి మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి కూను శ్రీహరి, గౌడ్ నాయ కులు ముద్దా మురళి గౌడ్ , జడపల్లి కోటేశ్వరరావు గౌడ్, నరమాల మణి గౌడ్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోటో:-గౌడ సంఘం అధ్యక్షు పత్రం అందజేస్తున్న దృశ్యం