ఆర్టీసీ,మీడీయ ప్రతి నిధులకు
33 శాఖలకు ఉపయోగం
బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఈ ఏడాది సార్వత్రి ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగుల తోపాటు మీడీయ ప్రతి నిధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం పోలింగ్ రోజు విధులు నిర్వర్తించే
వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలిగించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు కమిషన్ ఆదేశించింది. ఇక అత్యవసర విభాగాల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. రైల్వే , విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్ తో పాటు తదితర డిపార్ట్మెంటులలో పనిచేసే ఉద్యోగులకు, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులుకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పించింది.
పోటో:-పోష్టల్ బ్యాలెట్