డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :మండలంలోని పాతనాలపాడు పోలింగ్ సెంటర్ ను బుధవారం తాహిసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ తనిఖీ చేశారు. ఎలక్షన్ రోజున ఓటర్లకు, పోలింగ్ అధికారులు సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులుదే అన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారానికి సైతం అనుమతులు తీసుకోవాలని, ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధన ప్రకారం నడుచుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ప్రజలు పార్టీలు వివాదాలకు దూరంగా ఉండి ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత మన అందరిదీ అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, వీఆర్వో మోహన్, పంచాయతీ కార్యదర్శి, సచివాల సిబ్బంది ఉన్నారు.