డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి పంచాయితీ కందులవారి పల్లి గ్రామం నుండి వైకాపా నుండి టిడిపి లోకి బుధవారం పలువురు చేరినారు. స్థానిక టిడిపి నాయకులు చెలికం భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు సహకారంతో వీరంతా పార్టీ మారారు. బుధవారం కందులవారిపల్లి లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో తన్నీరు వెంకటేశ్వర్లు, తన్నీరు రఘురామయ్య, తన్నీరు ఈశ్వరయ్య,కానూరు నాగేశ్వరరావు, దవనం సుబ్రహ్మణ్యం, నిమ్మల అంకయ్య, వేపినాపి పెంచలయ్య టిడిపిలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని వెంకటగిరిలో తన కుమార్తె సాయి లక్ష్మీ ప్రియా మంచి మెజార్టీతో గెలుస్తుందిన్న నమ్మకం తనకుందన్నారు. టిడిపిలోకి వచ్చేవారిని సాధారంగా ఆహ్వానిస్తున్నట్లు మరి కొన్ని రోజుల్లో డక్కిలి మండలంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని అందరూ సమిష్టిగా టిడిపి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఓపిక లేనివారు పదవుల కోసం మారేవారిని ఎవరు ఆపలేరు అన్నారు. నేడు గురువారం సాయి లక్ష్మీ ప్రియ అల్తూరుపాడు లో తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు, ఈనెల 29, ఏప్రిల్ ఒకటి కురుగొండ్ల రామకృష్ణ తన కుమార్తెకి మద్దతుగా మండలంలో సమాచారం. ఏప్రిల్ 5వ తేదీ టిడిపి అభ్యర్థి అయిన కురుగొండ్ల సాయి లక్ష్మీ ప్రియ దేవుడు వెల్లంపల్లి స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామిని దర్శించుకుని అక్కడ తన ప్రచారాన్ని ఆమె జరుపుతారు. అదే రోజు వైకాపా నుండి కొన్ని పంచాయతీల నుండి ముఖ్యలను టిడిపిలోకి చేర్చుకునే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం తెలిసింది. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాసులు రెడ్డి, పి పి చౌదరి, ఒంటిమిట్ట రత్నయ్య, పొట్టేళ్ల శ్రీనివాసులు, రాజా, తన్నీరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.