టిడిపి అభ్యర్థి లక్ష్మీసాయి ప్రియ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్ప్రెస్)
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచెయ్యాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కె. లక్ష్మీసాయి ప్రియ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో వెంకటగిరి పట్టణ క్లస్టర్ ఇన్చార్జ్లు, బూత్ ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లోకి నిత్యం వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్ళాలన్నారు. తన గెలుపుతో వెంకటగిరి ప్రజల కష్టాలన్నీ తీరుతాయని, మీరంతా కూడా ఎన్నికల వరకు అంకితభావంతో పనిచెయ్యాలని కోరారు.